- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
సద్దుల బతుకమ్మ వేడుకలు పురస్కరించుకుని శనివారం మండలంలోని పెద్దతూండ్ల హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మానస, సుజాత, సిహెచ్ శర్మ ,యాకూబ్ పాషా ,ఐత మహేందర్, గోపి నాయక్, చంద్ర ప్రకాష్ ,ఒ.ఎస్ సందీప్, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -