Saturday, September 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
మండల కేంద్రమైన ముధోల్లోని, రబింద్ర, అక్షర, లిటిల్ ఫ్లవర్, శ్రీసరస్వతీ శిశు మందిర్, సంకల్ప్ వ్యాలీ పాఠశాలలో  శనివారం తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగుల రంగుల పూలను పేర్చి బతుకమ్మను తయారు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా విద్యార్థినులు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి ఉత్సాహంతో కోలాటాలు వేశారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రబింద్ర, అక్షర, లిటిల్ ఫ్లవర్, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్,  చైర్మన్ భీమ్రావు దేశాయి,  సుభాష్, నజీబ్ ఖాన్, సారథి రాజు, సంకల్ప్ వ్యాలీ స్కూల్ కరస్పాండెంట్ శేషరావు రాథోడ్, ప్రిన్సిపాల్ మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -