నవతెలంగాణ -మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా శనివారం దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ దీపావళి ప్రాముఖ్యతపై అవగాన కల్పించారు.మంచిని సాధించిన విజయం, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అన్నారు.నరకాసురున్నీ సంహరించిన తర్వాత ప్రజలు సంతోషంతో జరుపుకునే సంబరమే దీపావళి పండుగని,ఇది కాలక్రమమైన దీపావళిగా మారిందన్నారు. ఈ పండుగలో దీపాలను వెలిగించడం.బాణ సంచాలకు సంచాలను కాల్చడం. లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటిలోపల వెలుగులతో నిండాలని, ప్రతి ఇల్లు వెలుగులతోటి కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు బానసంచాలు కాల్చేటప్పుడు దూరంగా ఉండి పొడవాటి కట్టేతోటి జాగ్రత్తగా బాణసంచాలు కాల్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు దీపావళి సంబరాలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES