Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంక్రాంతి పండగ ముఖ్యంగా నాలుగు రోజులు జరుపుకోవడం జరుగుతుందన్నారు. మొదటి రోజు భోగి,రెండవ రోజు మకర సంక్రాంతి,మూడవరోజు కనుమ, నాలుగవ రోజు ముక్క కనుమని వీటి ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించినట్లుగా తెలిపారు. విద్యార్థిని,విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో రంగురంగుల రంగవల్లికలు వేసి తమ ప్రతిభను కనబరచడం జరిగిందన్నారు. పాడిపంటలకు ప్రతీక సంక్రాంతి,హరిదాసులు,పతంగులపై జాగ్రత్తలు,అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -