Wednesday, February 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపక్కా పైసా వసూల్‌..

పక్కా పైసా వసూల్‌..

- Advertisement -

బన్నీవాస్‌, వంశీ నందిపాటి నిర్మాతల ద్వయం తాజాగా నంది పాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై ‘హే బల్‌వంత్‌’ (హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్‌, శివానీ నాగారం, సీనియర్‌ నటుడు నరేష్‌, యాంకర్‌ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ‘నాట్‌ ఏ టైటిల్‌’ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సందీప్‌ కిషన్‌ విచ్చేశారు. హీరో సుహాస్‌ మాట్లాడుతూ, ‘వంశీ నందిపాటి మంచి ప్లానింగ్‌తో సినిమా మీద బజ్‌ తీసుకొచ్చాడు.

దర్శకుడు గోపీ ఈ సినిమాతో తన డ్రీమ్‌ నెరవేర్చుకున్నాడు. నా కెరీర్‌లో ‘మజిలీ’ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. మళ్ళీ ఈ సినిమాతో నాకు పెద్ద హిట్‌ వస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా. వినోదం, ఎమోషన్‌, అన్నీ ఉన్నాయి’ అని శివానీ నాగారం చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ,’సినిమా చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ప్రేక్షకులకు పక్కా పైసా వసూల్‌ సినిమా. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు గోపీకి మీ అందరి సమక్షంలో రెండో సినిమా అడ్వాన్స్‌ ఇస్తున్నాను’ అని తెలిపారు. నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ‘మా బ్యానర్‌ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. వంశీ నందిపాటి ఇన్‌ అయిన తరువాత ఈ సినిమా విషయంలో నేను రిలాక్స్‌ అయ్యాను’ అని అన్నారు. దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ, ‘తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అయ్యే సినిమా ఇది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -