- Advertisement -
ననతెలంగాణ-హైదరాబాద్: గ్రీస్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూప్రకంపనల ప్రభావంతో గ్రీస్ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్, తుర్కియే, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- Advertisement -