- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ లోని రాజ్ కోట్ లో వరుస భూప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకుజనం గురయ్యారు. రాజ్ కోట్ జిల్లాలోని జెట్ పూర్ దొరోజి, ఉప్లేటా పరిసర గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. 11 గంటల్లో సుమారు 7 సార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రిక్టర్ స్కేల్ పై 3.8 గా తీవ్రత నమోదైంది. ఉదయం 6:19 గంటలకు, ఆ తర్వాత ఉదయం 8:34 గంటలకు మొత్తం ఏడు ప్రకంపనలు సంభవించాయని అంటున్నారు. ప్రకంపనలకు భయపడి తమ ఇళ్లను వదిలి పొలాలకు పరుగులు తీశారమని స్థానికులు అంటున్నారు.
- Advertisement -



