నవతెలంగాణ-హైదరాబాద్ : పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 1:26 గంటలకు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు తెలిపింది. తాజా భూకంపం వల్ల ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.
గత మూడు రోజుల్లో పాకిస్థాన్‌లో భూమి కంపించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. శనివారం కూడా పాకిస్థాన్‌లో రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. శనివారం ఉదయం 5.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం రాగా, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే 4.0 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
పాకిస్థాన్ లో భూకంపం..
- Advertisement -
- Advertisement -