Sunday, April 5, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఏపీలో భూప్రకంపనలు..ఇళ్ల నుంచి బయటకు పరుగులు

ఏపీలో భూప్రకంపనలు..ఇళ్ల నుంచి బయటకు పరుగులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 30 సెకండ్లపాటు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సుమారు 30 సెకన్ల పాటు కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి దద్దరిల్లడంతో ఉలిక్కిపడి లేచి, ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరకు-పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుండటంతో అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు సహజమేనని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఈ స్థాయి అనుభవం తమకు ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు.

ఈ భూప్రకంపనల ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కనిపించినట్లు సమాచారం. కొన్ని ఇళ్లలో అల్మారాల్లో ఉన్న సామాగ్రి కింద పడిపోవడం, గోడలకు స్వల్పంగా పగుళ్లు రావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, తాజా నివేదికల ప్రకారం ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు అయినట్లు అధికారికంగా ధృవీకరించబడలేదు. దీనిని తక్కువ తీవ్రత కలిగిన మైనర్ ట్రెమర్ గా వాతావరణ, భూగర్భ పరిశోధన సంస్థలు భావిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -