- Advertisement -
భయందోళనలో ప్రజలు..
నవతెలంగాణ – చందుర్తి
మండలంలోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు సోమవారం సాయంత్రం 6.50 నిమిషాలకు సంభవించాయి. అనంత పల్లితో పాటు పలు గ్రామాల్లో సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కదిలినట్లుగా ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఎక్కువసేపు భూమి కంపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -