- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో తెల్లవారుజామున 4.18 గంటలకు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్‌లో భూమి కంపించింది. సింహాచలంలోనూ స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
- Advertisement -

                                    

