Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి అమ్ముకునే రైతులకు వెసులుబాటు 

పత్తి అమ్ముకునే రైతులకు వెసులుబాటు 

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి కరుణాకర్
నవతెలంగాణ – పాలకుర్తి

సిసిఐకి పత్తి అమ్ముకునే రైతులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మండల వ్యవసాయ అధికారి సింగారపు కరుణాకర్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో గల రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను అమ్ముకునేందుకు ఎదురయ్యే సమస్యలపై రైతు నేస్తం ద్వారా రైతులకు టెక్నికల్ బాధ్యులు పరిష్కార మార్గాలను వివరించారని ఏవో కరుణాకర్ తెలిపారు. సీసీఐకి పత్తి అమ్ముకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

సీసీఐకి ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి పరిమితం చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. స్పందించిన ఉన్నతాధికారులు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఏడు క్వింటాలకు బదులు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే విధంగా ఏఈఓ లకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. సి సి ఐ కి పత్తి అమ్ముకునేందుకు రైతు స్లాట్ బుక్ చేసుకునే ముందే ఏఈఓ లను సంప్రదించాలని రైతులకు సూచించారన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సూచించారు. ఎకరాకు పదికింటల్లా పత్తి సిసిఐకి దిగుబడి అయ్యే విధంగా ఏ ఈ ఓ లు చర్యలు చేపడతారని రైతు నేస్తం కార్యక్రమంలో దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు జాటోతు రాధిక, మాన్యపు దీపక్, ముత్తినేని వెంకటేష్, కీర్తి, శ్యామల తో పాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -