నవతెలంగాణ – కాటారం
ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాటారం డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం “రన్ ఫర్ జీసస్” శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఐదు మండలాలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు వై. సుందర్ రావు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రేమ, శాంతి, సహనానికి ప్రతీకగా నిలిచారని, ఆయన బోధనలు మానవాళికి మార్గదర్శకమని తెలిపారు.
ర్యాలీలో పాల్గొన్న వారు నినాదాలతో సందడి చేస్తూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేములూరు ప్రభాకర్ రెడ్డి, మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జనగం కరుణాకర్ రావు, ప్రధాన కార్యదర్శి చీమల రాజు, నాయకులు నాయిని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకుడు మారుపాక రాజేంద్ర ప్రసాద్, బీరెల్లి మహేష్, గౌరవ అధ్యక్షుడు రవి, వైస్ ప్రెసిడెంట్ రవి దానియేలు, మాజీ అధ్యక్షుడు డేవిడ్ మార్క్, జనరల్ సెక్రటరీ పి. జోషి, జాయింట్ సెక్రటరీ ప్రకాష్, ట్రెజరర్ బన్సిలాల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సామ్యేల్, పాస్టర్ రూబెన్, సలహాదారులు తిమోతి, లూకా, వివిధ మండలాలకు చెందిన పాస్టర్లు, సేవకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.



