ఎస్సీ ఎస్టీ బ్యాగ్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
నవ తెలంగాణ- ఓయూ: నిత్యం ఖాళీలతో వెక్కిరిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఊరట లభించింది.మంగళవారం జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక మండలి సమావేశంలో పలు కీలమైన నిర్ణయాలు, ఆమోదం తీసుకోవడం విశేషం. వాటి లో ప్రధానంగా ఓయూ లో నూతనంగా 250 అసిస్టెంట్ ప్రొపెసర్స్ భర్తీకి ఆమోదం మెదం తెలిపారు.
కాంట్రాక్టు పోస్టులను ఖాళీ కింద చూపించకుండా వర్సిటీలో 1200 ఖాళీలు ఉండగా వాటిలో 250 ఆమోదం తెలిపారు. ఇక హబ్సిగూడా ప్రధాన రహదారి వెంట నిర్మాణం చేస్తున్న సెంటినరి బిల్డింగ్ ను దసరా పండగ లోపే ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న సుమారు 38 ఎస్సీ , ఎస్టీ బ్యాగ్ లాగ్ పోస్టులకు ఆమోద ముద్ర వేశారు.
వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నూతన డీఏను వచ్చే నెల వేతనం తో కలిపి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. కొంత సమయం మాత్రమే ఈసీ జరిగిన పలు కీలమైన నిర్ణయాలు తీసుకోవడం విశేషం. దీనితో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ వీసీ చాపకింద నీరులా పలు కీలకమైన ఆమోదలతో పాటుగా నిర్ణయలు తీసుకోవడం విశేషం..