మండిపడిన రాహుల్
ఆనంద్ (గుజరాత్) : కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ రాజ్యాంగ సంస్థ ఇప్పుడు బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ అడించినట్లు ఆడుతోందని మండిపడ్డారు. గుజరాత్‌లో కాంగ్రెస్ వరుస ఓటములకు ఎన్నికల సంఘమే కారణమని ధ్వజమెత్తారు. బీజేపీ బలానికి కేంద్ర స్థానంగా ఉన్న గుజరాత్‌లో ఆ పార్టీని మట్టికరిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో శనివారం జరిగిన కాంగ్రెస్ జిల్లా పార్టీ నూతన అధ్యక్షుల శిక్షణా శిబిరాన్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ అభ్యర్థుల ఎంపికలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ వాటిని ప్రభుత్వ దృష్టికి తేవాలని పార్టీ శ్రేణులను రాహుల్ కోరారు.
ఈసీ పక్షపాత వైఖరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES