నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ సోమవారం బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈసీ (ఎన్నికల సంఘం)ని ఎన్నికల రిగ్గింగ్ యంత్రాంగంగా మార్చిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయినాసరే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పాల్పడినా.. డిఎంకె మాత్రం అందరినీ కలుపుకుంటూ భుజం భుజం కలిపి పోరాటం చేసేందుకు నిలబడుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ‘బిజెపి ఎన్నికల సంఘాన్ని తన ఎన్నికల రిగ్గింగ్ యంత్రాంగంగా మార్చుకుంది. బెంగళూరులోని మహదేవపురంలో జరిగింది పరిపాలనా లోపం కాదు.. ప్రజల ఆదేశాన్ని దొంగిలించడానికి జరిగిన కుట్ర’ అని స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకి జతగా.. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతకల్ని ఎత్తిచూపిన వీడియోను సైతం ఆయన జత చేశారు.
ఈసీని రిగ్గింగ్ యంత్రాంగంగా మార్చారు: సీఎం ఎం.కె స్టాలిన్
- Advertisement -
- Advertisement -