Wednesday, April 8, 2026
E-PAPER
Homeజాతీయంఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ

ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ

- Advertisement -

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించింది. ఏప్రిల్‌ 9వ తేదీ ఉదయం 7.00 గంటల నుంచి ఏప్రిల్‌ 29వ తేదీ సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే నిర్వహించడం, వాటి ఫలితాలను వెల్లడించకూడదని ఎన్నికల కమిషన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్దిష్ట సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం లేదా వెల్లడించడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 126ఎను ఉల్లంఘించడమేనని హెచ్చరించింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్ల కఠిన కారాగారశిక్ష లేదా జరిమానా , లేదా రెండూ అమలు చేయవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా కేరళ, అసోం రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 9న, తమిళనాడులో ఏప్రిల్‌ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఏప్రిల్‌ 30 వెలువడనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల్లో మంగళవారం సాయంత్రం 6.00గంటలకు ప్రచారాన్ని నిలిపివేయాల్సి వుండగా, అసోంలో సాయంత్రం 5.00గంటల నుంచి నిషేధం అమలు కానుంది. పరిమిత సంఖ్యలో పార్టీ కార్యకర్తలు లేదా అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చేసే ప్రచారం మినహా, మరే ఇతర ప్రచారానికి అనుమతి లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -