Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం'పోలవరం-బనకచర్ల' ప్రతిపాదనలను ఈసీబీ తిప్పిపంపింది

‘పోలవరం-బనకచర్ల’ ప్రతిపాదనలను ఈసీబీ తిప్పిపంపింది

- Advertisement -

– రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ (పీబీఎల్‌పీ) కోసం పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనాన్ని చేపట్టడానికి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌) మంజూరు చేయాలని కోరుతూ జూన్‌ 5న ఏపి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రతిపాదనలపై నది లోయ, జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల నిపుణుల అంచనా కమిటీ(ఈఏసీ) జూన్‌ 17న జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలిపింది. ప్రతిపాదనలను తిప్పిపంపినట్లు వెల్లడించింది. ఈ వివరాలను గురువారం రాజ్యసభలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్‌ సింగ్‌ రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఈఏసీ మీటింగ్‌లో ఏపీ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసినట్టు చెప్పారు. పర్యావరణ ప్రభావ అంచనా(ఇఐఎ) నిర్వహించడానికి కావాల్సిన టీఓఆర్‌ రూపొందించడానికి ప్రతిపాదనలు సమర్పించే ముందు అంతర్రాష్ట్ర సమస్యల పరిశీలన, అవసరమైన క్లియరెన్స్‌/నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) మంజురు చేయడానికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ)ను సంప్రదించాలని సూచించినట్టు తెలిపారు. పైన చెప్పిన విధంగా నూతన ప్రతిపాదనలు పంపాలని ఏపి ప్రభుత్వానికి ఈఏసీ ప్రతిపాదనలను తిప్పి పంపినట్టు కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad