- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి: ఎకరా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగుచేస్తే..సుమారు రూ. లక్ష ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపాలని ఏఓ సంతోష్ రైతులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏఓ సంతోష్ ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మండలంలో సుమారు 423 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని ఏఓ తెలిపారు. ఏఈఓ విజయ్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -