- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రముఖ ఆర్థికవేత్త సుబ్రమణియన్ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో సీఎం ఆయనతో పలు అంశాలపై చర్చించారు. విద్యుత్‌రంగంలో ఖర్చుల నమూనా , స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుబ్రమణియన్ పలు కీలక సూచనలు చేసినట్టు సమాచారం.
- Advertisement -



