Thursday, September 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఈక్వెడార్‌ డీజిల్‌ సబ్సిడీ రద్దు

ఈక్వెడార్‌ డీజిల్‌ సబ్సిడీ రద్దు

- Advertisement -

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వర్సిటీ విద్యార్థుల నిరసన జ్వాల

ఈక్వెడార్‌ : డీజిల్‌ సబ్సిడీని రద్దు చేస్తున్నట్టు ఈక్వెడార్‌ అధ్యక్షుడు డేనియల్‌ నోబోవాస్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వందలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఈక్వెడార్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జీవన వ్యయం విపరీతంగా పెరుగుతుందని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడి పదవి నుంచి డేనియల్‌ను తప్పించాలని వారు పిలుపునిచ్చారు. కాగా, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఈక్వెడార్‌ నుంచి ఈ ఆందోళన ప్రారంభమై.. ఈక్వెడార్‌ రాజధాని క్విటో నగర వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా ‘నోబోవా అవుట్‌’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అధ్యక్ష భవనం కరోన్‌డెలెట్‌ ప్యాలెస్‌ను చుట్టుముట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. మార్గ మధ్యలోనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసులు, మిలి టరీ దళాలు వీధుల్లో బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.

అయినప్పటికీ నిరసన కారులు వెనక్కి తగ్గకుండా.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో వారిపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. శుక్రవారం సెప్టెంబర్‌ 12న నొబావా సంతకం చేసిన డిక్రీ 126కి వ్యతిరేకంగా విద్యార్థులు ఈ మార్చ్‌ నిర్వహించారు. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీ తగ్గించడం ద్వారా ప్రజలపై ఏడాదికి 1.1 బిలియన్‌ డాలర్ల మేర భారం పడనుంది. ఈ 126 డిక్రీని రద్దు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని యూసీఈ యూనివర్సిటీ కౌన్సిల్‌ ప్రతినిధి విల్‌ చుక్విమార్కా ప్రకటించారు. ప్రధానంగా ఇంధన ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఈక్వెడార్‌లో విస్తృతంగా విని యోగంలో ఎక్స్‌ట్రా అండ్‌ ఎకోపైస్‌ గ్యాసోలిన్‌, టు -85 ఆక్టేన్‌ ఇంధనా లపై గతేడాది నోబొవా లకు సబ్సిడీలను రద్దు చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -