వైభవంగా జాతర ఉత్సవాలకు ఏర్పాటు
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మల్లన్న దేవుని జాతర రేపటి నుండి ప్రారంభం కానుంది. దీంతో ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లను విస్తృతంగా చేశారు. ఈ జాతర రేపటి నుండి ఫిబ్రవరి04వ తేదీ వరకు కొనసాగనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.ఈ నెల 31న రాత్రి శ్రీ మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం,ఫిబ్రవరి1న చల్లని అంబళ్ళు,02న దేవుని పల్లకి ఊరేగింపు, 03న కుస్తీ పోటీలు,రాత్రి అగ్నిగుండా ప్రవేశం,సుమారు రూ.లక్ష తో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు.తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం మల్లయోధులు తరలివస్తారు.
ఫైనల్ కుస్తీ పోటీల్లో ఫైనల్ విజేతకు 10 వేల నగదు.50 గ్రాముల వెండికడియం,రెండవ విజేతకు5వేల నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.04న అడపడుచుల జాతర, అంబలి కుండా ఇంటికి తేవడంతో జాతర ముగుస్తుంది.ఈ జాతరకు బైంసా నుండి ప్రత్యేక బస్సులు నడుప బడుతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ జాతరకు వివిధ ప్రాంతాలనుండి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం దేవుని కళ్యాణం జరిగిన తర్వాత గ్రామంలో పెళ్లి కార్యక్రమాలు చేయడం ఆనవాయితిగా వస్తుంది.ఈ జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



