Saturday, September 13, 2025
E-PAPER
Homeబీజినెస్అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

- Advertisement -

– 5న విచారణకు హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ :
బ్యాంక్‌ రుణాల ఎగవేత, మనీలాండరింగ్‌ కేసులో రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌ (ఆర్‌కామ్‌) చైర్మెన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న తమ ముందు విచారణకు హాజరుకావాలని అనిల్‌ను ఈడీ ఆదేశించింది. ఇప్పటికే అనిల్‌ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు అనిల్‌ అంబానీ కంపెనీలపై సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి. సోదాల అనంతరం కీలక సమాచారం లభ్యం కావడంతో అనిల్‌ను ఇడి ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది. రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్‌ గ్రూప్‌ కంపెనీల్లో సోదాలు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -