– 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
– ఆగస్టు 4,5 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోెర్సులో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఎడ్‌సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మెన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎడ్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎడ్‌సెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 14న ఎడ్‌సెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.త ఈనెల 21 నుంచి ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనీ, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరారు. ఎన్‌సీసీ, సీఏపీ, వికలాంగులు, స్పోర్ట్స్ అభ్యర్థులకు ఈనెల 23 నుంచి 26 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వివరించారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను వచ్చేనెల రెండున విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదేనెల నాలుగు, ఐదు తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని తెలిపారు.
అదేనెల తొమ్మిదో తేదీన ఎడ్‌సెట్ తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన సీట్లను కేటాయిస్తామని తెలిపారు. అదేనెల 11 నుంచి 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాలనీ, కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. వచ్చేనెల 18 నుంచి ఎడ్‌సెట్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.
21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES