నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన ఎడ్ల రాముకు హైదరాబాద్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్ఫూర్తి బ్యాచ్ (255) 40 రోజుల ఆన్లైన్ శిక్షణ, రెండు రోజులపాటు మోటివేషనల్ “ట్రైన్ ది ట్రైనర్” వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో చురుకుగా పాల్గొని, తన అసాధారణ ప్రదర్శనతో ఉత్తమ ప్రసంగ ప్రదర్శన అవార్డ్ ఉత్తమ మోటివేషనల్ స్పీకర్” సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ను ప్రముఖ టాలీవుడ్ నటుడు, నేషనల్ ట్రైనర్, ప్రొడ్యూసర్ కె.వి. ప్రదీప్ చేతుల మీదుగా, అవార్డు అందుకున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ఈ ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు ఉచితంగా వ్యక్తిత్వ వికాస శిక్షణగా అందించి, సమాజ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ అందించనున్నానని తెలిపారు.
ఎడ్ల రాముకు ఉత్తమ ప్రసంగ ప్రదర్శన అవార్డ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



