నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎస్వి డెక్కన్ ఇoపెక్స్ చైర్మన్ ఎడ్ల వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలలో ఆయన అభిమానులు, ఏ వి ఆర్ యువసేన సభ్యులు కేక్ కట్ చేసి, ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయనను పూలమాల శాలువలతో సన్మానించారు. వారి స్వగృహంలో స్వర్ణగిరి దేవాలయ పండితులు ఆయనకు వేదమంత్రోచ్ఛారణలతో వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో ఆశీర్వచనాలు అందించి ప్రసాదాన్ని అందించారు.
తదనంతరం వెంకటరెడ్డి రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధాశ్రమం, టేకులసోమరం లోని సాధన సంస్థ వికలాంగుల ఆశ్రమం లో లోని అన్నదానం నిర్వహించారు. స్వర్ణగిరి దేవాలయం లో ఏ వి ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఆయన అభిమానులు పూజలు నిర్వహిచారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, ఎస్ వి డెక్కన్ ఇంపేక్స్ డైరెక్టర్ ఎం డి సమిఉద్దీన్, మోర నర్షి రెడ్డి, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వైద్యులు ఎడ్ల అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఆంజనేయులు, మోర రాం రెడ్డి,దొంకేన అశోక్, వళ్ళందస్ పరమేష్,అన్నెపు శ్రీశైలం, ఎం డి బాబా, రావుల మహిపాల్, కరుణాకర్ దొంకేన మహేష్, ఉడిత శ్రీశైలం, ఎండీ షాబీర్, కైతపురం ఆంజనేయులు,దొంకేన అనీల్,మల్లేష్, పాల్గొన్నారు.
ఘనంగా ఎడ్ల వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES