నవతెలంగాణ-హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వారు రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. నవంబర్ 2023లో నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ ఆ నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్ అనుభవించారని కోర్టుకు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ గతంలో విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారన్న ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి.
నేషనల్ హెరాల్డ్ కేసు లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వారు రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. నవంబర్ 2023లో నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ ఆ నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్ అనుభవించారని కోర్టుకు తెలిపారు. ఆయా ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. దీన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ వార్తాపత్రిక మూసివేశారు. అయితే, ఇక్కడే ఈ వివాదం ప్రారంభమైంది. దీని తర్వాత 2010లో, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (YIL) అనే కంపెనీ ఏర్పడింది. దీంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 38-38శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో వైఐఎల్ రూ.2వేలకోట్లకుపైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను కేవలం రూ.50లక్షలకు కోనుగోలు చేసిందని.. ఇది మోసమని ఆరోపించారు.
మరోవైపు ఈడీ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరు నేతలపై చార్జిషీట్ దాఖలు చేయడం అనేది ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, బెదిరింపులకు ప్రత్నించడమే తప్ప మరొకటి కాదన్నారు. భారత జాతీయ కాంగ్రెస్.. దాని నాయకత్వం మౌనంగా ఉండదు.. సత్యమేవ జయతే! అంటూ ట్వీట్ చేశారు.