- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోెర్సులో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ దరఖాస్తు గడువును ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎడ్‌సెట్ కన్వీనర్ బి వెంకట్రామ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఆలస్య రుసుం లేకుండా ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయాలని సూచించారు. జూన్ ఒకటిన ఎడ్‌సెట్ రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు.
- Advertisement -