Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతీసిన విద్యా కమిషన్‌ రిపోర్ట్‌

ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతీసిన విద్యా కమిషన్‌ రిపోర్ట్‌

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విద్యా కమిషన్‌ రిపోర్ట్‌ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతీసేలా ఉందని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాలను నిర్ధారించాల్సింది విద్యాకమిషన్‌ కాదనీ, పీఆర్‌ఎస్‌ నిర్ణయిస్తుందని అన్నారు. తలా, తోక లేకుండా ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్‌ తయారు చేశారని విమర్శించారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల కించపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి అనడాన్ని ఆయన తప్పుపట్టారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ మెప్పు పొందేందుకు కమిషన్‌ తప్పుడు నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. రూ.7,900 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమంతో 25 వేల స్కూళ్లను కేసీఆర్‌ బాగు చేశారని గుర్తు చేశారు. గురుకులాలకు పెద్దపీట వేశామని చెప్పారు. మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, స్పోర్ట్స్‌ అకాడమీలు.. ఇలా ఎన్నో గత సర్కార్‌ హయంలో ప్రారంభించిన విషయం కమిషన్‌కు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని విద్యా కమిషన్‌ కాపీ పేస్ట్‌ చేసిందని ఎద్దేవా చేశారు. తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్‌ రిపోర్ట్‌ను చెత్త బుట్టలో వేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -