Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ 

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
తక్షణమే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేకపోవడంతో పాటు పాఠశాల చేరుకోవాలంటే కనీస దారి సౌకర్యం లేని తుర్బర పరిస్థితిలో నెలకొన్నాయన్నారు. వర్షం వస్తే పాఠశాల దారి బురదమయం కావడంతో విద్యార్థులు నడవలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు.

అదేవిధంగా పరకాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ కు నూతన బిల్డింగ్ నిర్మించాలన్నారు.మల్లారెడ్డి ప్రైమరీ స్కూల్లో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాల పైకప్పు రేకులకు చిల్లు పడి తరగతి గదులు కురుస్తున్నాయన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి పరకాల పట్టణంలో ఉన్న విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పట్టణ కార్యదర్శి కోగీల సాయి తేజ ప్రభుత్వ కాలేజ్ ప్రెసిడెంట్ ప్రభాస్ ప్రధాన కార్యదర్శి అజయ్ ఉపాధ్యక్షుడు రోహిత్ సహాయ కార్యదర్శి అవినాష్. బన్నీ రాహుల్ విజయ్ సూర్య అరవింద్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img