Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ

విద్యాసంస్థల బంద్ విజయవంతం: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఎస్ఎఫ్ఐ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్, ఏఎస్ఎఫ్ నగర్కర్నూలు జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ లను విడుదల చేయాలని,  మిస్ కాస్మోటిక్ చార్జీలు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు.  అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో యూనిఫాంలో పాఠ్యపుస్తకాలు వెంటనే ఇవ్వాలని,  వసతి గృహాల సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్ స్కాలర్షిప్ ల నిధులు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ స్కాలర్షిప్ నిధులను, కామెస్కాస్మటిక్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. లేనియెడల వామపక్ష విద్యార్థి సంఘాల  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు విజయ్, సాయి,  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -