ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం
వామపక్ష విద్యార్థి సంఘాలు…
నవతెలంగాణ – బంజారా హిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈ నెల 23న విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. (ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఎ, పీడీఎస్ఎయూ,పీడీఎస్ఈయూ, ఎఐడిఎస్వే, ఎఐపీఎస్ఆూ,ఎఐఎఫ్ఎస్,ఎ ఐ ఎఫ్ బి)ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,జూనియర్ కళాశాలల బంద్ను నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి నరేష్,ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు దామెర కిరణ్,కే అశోక్,డి ఎస్ యు ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్, నాగరాజు,ఏఐపిఎస్ యు అధ్యక్షులు బోడ అనిల్, ఏఐఎఫ్డిఎస్ అధ్యక్షులు గడ్డం నాగరాజు, ప్రధాన కార్యదర్శి పల్లె మురళి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నవాద్, చంద్రన్నలు బుధవారం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్మిట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి, ప్రసంగించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యా శాఖ మంత్రిని నియమించకుండా కాలం వెల్లదీస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బడ్జెట్ లేమితో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయనీ, పేరుకే విద్యా కమీషన్ ఏర్పాటు చేశారు, కానీ వారి సూచనలు అమలుకు నోచుకోలేదనీ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాక ముందు విద్యకు 15% నిధులు కేటాయిస్తామని డిక్లరేషన్లో ప్రకటించినప్పటికి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే 7% మించి బడ్జెట్ కేటాయింపులు జరపలేదని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య వ్యతిరేక విధానాలపై జూలై 23న విద్యా సంస్థల బందు నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి నేతలు తెలిపారు. ఈ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేట్, కార్పోరేట్ విద్యా సంస్థల యజమాన్యాలు సహకరించాలని కోరారు.
ప్రధాన డిమాండ్స్…
1. ప్రయివేట్, కార్పోరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.
2. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయాలి.
3. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.
4. పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.
5. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు ఇవ్వాలి.
6. పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలి.
7. అద్దె భవనాలలో నడుస్తున్న వసతి గృహాలకు స్వంత భవనాలు నిర్మించాలి.
8. గురుకులాలలో అశాస్ర్యీంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలి.
9. బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలి.
10. ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలి.
11. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి.
12. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలి.
13. NEP-2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాల బందుకు సహకరించని పాఠశాల కళాశాలను ముందు నిరసన తెలిపి ముపిస్తామనీ హెచ్చరించారు.