నవతెలంగాణ – జుక్కల్
మండలంలో పలు గ్రామాలలో రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆ గ్రామాలను సందర్శించారు. జుక్కల్ మండలంలోని హంగర్గా – మాదాపూర్ గ్రామాల మధ్య ఉన్న మల్లన్న వంతెన వద్ద లో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో పర్వతప్రాంతాల నుంచి వర్షపు నీరు భారీగా ప్రవహిస్తూ రోడ్డును కప్పేసింది. ఇందుమూలంగా మండలంలోని హంగర్గా, మాదాపూర్ , చెండేగావ్ గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, సిబ్బంది, జుక్కల్ ఆర్ఐ రామ్ పటేల్, సిఈఓ రమేష్, జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర, పోలీసు సిబ్బందితో కలిసి లో లెవెల్ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటిని క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు.
మాదాపూర్ – హంగర్గ మల్లన్న గుట్ట లో లెవెల్ వంతెన వద్ద భారీగా నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు జరగకుండా రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ ట్రాలీ నిలబెట్టి ప్రమాదాలు చోటు చేసుకోకుండా రాకపోకలు జరగకుండా కామ్ దారులను కాపలాగా ఉంచి దారిని నిలిపివేశారు. అదేవిధంగా హంగర్గా గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద గల సిసి రోడ్డు ప్రాంతంలో భారీగా నీరు వచ్చి చేరడంతో గ్రామంలో ఇంటికి వెళ్లలేకుండా పలువురు బయిటే ఉండవలసిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండడంతో యంత్రాల సాయంతో చెత్తాచెదారాన్ని రోడ్డుపైకి రాకుండా ఎంపీడీవో ఆధ్వర్యంలో తొలగించేశారు.
వర్షాలు పడుతున్నందుకు గ్రామాలలో ఉంటున్న ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకి రావద్దని అధికారులు గ్రామ సెక్రెటరీలకు ముందస్తు హెచ్చరికలు చేసి సిబ్బంది, గ్రామీణ ప్రజలకు అప్రమత్తం చేశారు. మండల స్థాయి అధికారులు వరద ముంపు గ్రామాలను పరిశీలించారు. హంగర్గా గ్రామంలో ఓ ఇల్లు వెనుక భాగంలో పాక్షికంగా కూలిపోవడం జరిగింది. ఈ పరిశీలన కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు చెండేగావ్ సెక్రెటరీ వికాస్ రెడ్డి, హంగర్గ సెక్రెటరీ అశోక్ గౌడ్ పాల్గొన్నారు. గ్రామస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులకు సమాచారం అందిస్తూ గ్రామంలోనే ఉంటున్నారు.
భారీ వర్షాల ఎఫెక్ట్.. గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES