Sunday, April 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌

అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌

- Advertisement -

మదురో కేసులో ఇబ్బందులు
న్యాయ సహాయానికి అడ్డంకి
వాషింగ్టన్‌ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యపై అమెరికాలో నడుస్తున్న కేసులో.. అమెరికా విధించిన ఆంక్షలు ప్రధాన చర్చగా మారాయి. ఈ ఆంక్షల వల్ల వారికి న్యాయ సహాయం అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కోర్టులో వాదనలు జరిగాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యపై అమెరికాలో డ్రగ్‌ ట్రాఫికింగ్‌, నార్కో టెర్రరిజం కేసు నడుస్తోంది. వీరిని ఒక ప్రత్యే సైనిక చర్య ద్వారా అమెరికాకు తీసుకొచ్చి న్యూయార్క్‌లోని జైలులో నిర్బంధించారు. ఈ కేసులో ముఖ్యమైన సమస్య ఏమిటంటే.. అమెరికా విధించిన ఆంక్షల వల్ల వెనిజులా ప్రభుత్వం తమ అధ్యక్షుడి న్యాయ ఖర్చులు చెల్లించలేకపోవడం. మొదట అమెరికా ట్రజరీ అనుమతి ఇచ్చినా.. తర్వాత అనుమతిని రద్దు చేసింది. దీంతో న్యాయవాదులకు చెల్లింపులు ఆగిపోయాయి. మదురో తరఫు న్యాయవాది మాట్లాడుతూ… ”ఇది అమెరికా రాజ్యాంగంలోని ఆరో సవరణ (న్యాయ సహాయం పొందే హక్కు) ఉల్లంఘనగా వాదించారు.

అంటే ఒక వ్యక్తికి తనకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉంటుంది. కానీ ఆంక్షల వల్ల ఆ హక్కు దెబ్బతింటోందని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అల్విన్‌ హెల్లెర్‌స్టీన్‌ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ”ఇప్పటికే వెనిజులాతో సంబంధాలు మారాయి. అయితే ఇంకా ఆంక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారు?” అని ప్రశ్నించారు. అమెరికా ప్రభుత్వం మాత్రం ”జాతీయ భద్రత, విదేశాంగ ప్రయోజనాల కోసం ఆంక్షలు అవసరం” అని సమాధానం ఇచ్చింది. ”న్యాయ సహాయం పొందే హక్కు అత్యంత ముఖ్యమైంది. ఆంక్షలు ఈ హక్కును అడ్డుకుంటే.. అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది” అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. కానీ ఈ కేసు ద్వారా అమెరికా విదేశాంగ విధానంలోని విరుద్ధతలు బయటపడ్డాయని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -