Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మ దహనం

ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

– సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో నిరసన
నవతెలంగాణ-నాగారం

వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నాగారం మండలం కొత్తపల్లి(డి) రోడ్డుపై నిరసన తెలిపారు. మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్‌, డివిజన్‌ అధ్యక్షులు సంపట కాశయ్య మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పూర్తిగా రద్దు చేసుకున్న ఒప్పందం భారత వ్యవసాయ రంగానికి, రైతాంగానికి మరణ శాసనమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేటు సంస్ధలకు లబ్ది చేకూర్చే విధంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పోలేబోయిన కిరణ్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు భయం లింగయ్య, యానాల సుధాకర్‌రెడ్డి, దోమలపల్లి గోవర్ధన్‌, ఏషబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -