Friday, May 30, 2025
E-PAPER
Homeఖమ్మంకొండ రెడ్ల సమగ్రాభివృద్ధికి కృషి : ఐటీడీఏ పీఓ రాహుల్

కొండ రెడ్ల సమగ్రాభివృద్ధికి కృషి : ఐటీడీఏ పీఓ రాహుల్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మారుమూల ప్రాంతాలలో నివసించే కొండ రెడ్ల గిరిజన కుటుంబాల సంక్షేమం కొరకు తప్పనిసరిగా మౌలిక వసతులు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట మండలం తిరుమల కుంట, పాతరెడ్డిగూడెం, గోగులపుడి గ్రామాల్లోని కొండ రెడ్ల గిరిజనులను కలిసి వారికి కావలసిన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ రెడ్ల గిరిజన కుటుంబాలకు తప్పనిసరిగా పీఎం జన్మన్ పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని,సొంత స్థలము ఉన్న కొండ రెడ్ల కుటుంబాలకు పీఎం జన్మన్ పథకం కింద ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని,ఈనెల 31 వరకు సర్వే ఉంటుందని,వారంరోజుల్లో  ప్రతి ఒక్క కొండ రెడ్ల కుటుంబాలకు మంజూరి పత్రాలు ఇచ్చి మూడు నెలల్లో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. నిరుద్యోగులైన కొండ రెడ్ల గిరిజన యువకులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి రుణాలు అందేలా చూస్తామని, పోడు పట్టాలు ఉన్న కొండ రెడ్ల గిరిజన రైతులకు ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా బోరు మోటారు డ్రిప్ ఇరిగేషన్ కనెక్షన్లు ఇప్పించి ఆయిల్ ఫాం, వెదురు,మునగ పెంపకం చేపడతామని, అంతర్ పంటలుగా పండ్లు కూరగాయలు మరియు ఇతర ఆకు కూరలకు సంబంధించిన పంటలు వేసుకోవచ్చని అన్నారు.కొండరెడ్ల విద్యార్థినీ విద్యార్థులకు తప్పనిసరిగా గురుకులంలో ఆశ్రమ పాఠశాలలో సీట్లు ఇప్పిస్తామని,డిగ్రీ,బీటెక్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒక సంవత్సరం కాలేజీ ఫీజు లేదా లాప్టాప్ అందిస్తామని అన్నారు.

మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న ధన లక్ష్మి కి త్వరలో నాడు లాప్టాప్ ఐటీడీఏ ద్వారా అందిస్తామని, నిరుద్యోగులైన కొండ రెడ్ల యువతీ యువకులకు వారే సొంతంగా జీవనోపాధి పెంపొందించుకోవడానికి మహిళలకు కుట్టు శిక్షణలు, యువకులకు సెల్ఫోన్ రిపేర్లు, ఆడియో వీడియో శిక్షణలు యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా ఇప్పిస్తామని, ఎప్పుడైనా జాబ్ మేళాలు నిర్వహించి తప్పనిసరిగా కొండ రెడ్ల గ్రామాలలో తెలిసే విధంగా చర్యలు చేపడతామని నిరుద్యోగులైన యువతి, యువకులు తప్పనిసరిగా జాబ్ మేళాలో పాల్గొని  ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొంది జీవనోపాధి పెంపొందించుకోవాలని అన్నారు. తిరుమల కుంట గ్రామములో మంచినీటి సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, కమ్యూనిటీ హాల్ కావాలని గ్రామస్తులు కోరగా ఏ ఈ ల ద్వారా సర్వే చేయించి దానికి సంబంధించిన రతిపాదనలు తయారు చేయించి తప్పనిసరిగా గ్రామస్తులు కోరిన విధంగా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. చివరిగా గుబ్బల మంగమ్మ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) డేవిడ్ రాజ్, అశ్వారావుపేట ఎంపీడీవో ప్రవీణ్,జే.డీ.ఎం హరికృష్ణ,హౌసింగ్ ఏఈ మదన్, తిరుమల కుంట పంచాయతీ కార్యదర్శి కార్తీక్, పాతరెడ్డిగూడెం, వినాయకపురం పంచాయతీ కార్యదర్శి సందీప్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -