టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
నవతెలంగాణ – సదాశివపేట
చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సదాశివపేట పురపాలక పరిధిలోని ఉభ చెరువులో మత్స్య శాఖ పంపిణీ చేసిన 56 వేల చేప పిల్లలను స్థానిక నాయకులతో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులు చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదలడం జరిగిందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 50 % శాతం మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేసిందని, ప్రజా పాలనలో 100% నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. మత్సకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సూచించారు. ముదిరాజుల అభివృద్ధికి ప్రజా పాలనలో ప్రత్యేక కార్యచరణ ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శివాజీ, మత్స్య శాఖ ఏడి సుదర్శన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్, ఆశి రెడ్డి, షాబుద్దీన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాయపాడు రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, రాములు గౌడ్, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్,నాయకులు హాజీ,షజ్జీ, తుల్జారాం, మామిడి రాజు, తుకారాం, బిట్ల ప్రేమ్ కుమార్, కోడూరి శరత్ చంద్ర, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చాపల హనుమంతు, కార్యదర్శి నల్ల శంకర్, ఉపాధ్యక్షుడు నల్ల సుధాకర్, సంఘం డైరెక్టర్లు చాపల అనిల్, నల్ల నరసింహులు, నల్ల శ్రీనివాస్, పెద్ద శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



