గెలుపొందిన సర్పంచ్లకు సన్మానం
నవతెలంగాణ – మిర్యాలగూడ
గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచులను సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మిమ్ములను సర్పంచులుగా గెలిపించాలని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ప్రధానంగా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తారని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయ అతీతంగా గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, గుండు నరేందర్, శంకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జగ్గారెడ్డి, చలపతిరావు,షేక్ జిందా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే బీఎల్ఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



