- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘం సభ్యులు సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని ఏపీఎం సాయిలు తెలిపారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య సమావేశం నిర్వహించారు. గత నెల సమావేశంపై చర్చ, ఆర్థిక లావాదేవీలు, సిఐఎఫ్ రుణాల మంజూరు, సంఘం బలోపేతం, నూతన ఎస్.హెచ్.జి, వృద్ధుల సంఘం, దివ్యాంగుల సంఘం, కిశోర బాలికల సంఘం ఏర్పాటు, బ్యాంకు లింకేజ్, శ్రీనిధి వివిధ అంశాలపై మహిళా సంఘం సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



