- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
దేవాలయ అభివృద్ధికి కమిటీ చైర్మన్ సభ్యులు బలోపేతానికి కృషి చేయాలని సర్పంచ్ సువర్ణ అన్నారు. మండలంలోని వెలుగోముల గ్రామంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీని శనివారం గ్రామస్తుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమె చెప్పారు. చైర్మన్ కుపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బాల్ రాజు, కమిటీ సభ్యులుగా పర్వతాలు, శైలజ, కృష్ణయ్య, మల్లయ్య, బంగారు, రామాంజనేయులు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమె చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శేఖర్ రెడ్డి ,రాజేందర్ రెడ్డి, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



