Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలి 

ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే పథకాలన్నీ కూడా విజయవంతంగా నిర్వహించి, పూర్తి చేసేందుకు అధికారుల కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఎంపీడీవో చాంబర్ లో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ఉపాధి హామీ పనుల జాతరపై, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే, ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి, గ్రామ పంచాయతీల వారిగా ఓటర్ లిస్ట్ ల గురించి సమావేశంలో సమీక్షించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

వనవాసంలో మొక్కల నాటడం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సర్వే  ఎంతవరకు పూర్తయ్యిందని వాకబు చేశారు. పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం చూపొద్దని, ఏమైనా ఇబ్బందులు ఉంటే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ  సమీక్ష సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -