Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి

గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి

- Advertisement -

నూతన పాలకవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్సీ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కోరారు. సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా పనిచేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -