Tuesday, October 14, 2025
E-PAPER
Homeజిల్లాలుక్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన  పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ జయ్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ చైర్మన్  హర్కర వేణుగోపాల్ రావు లు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు నియామకం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభిప్రాయాలను అబ్జర్వర్లకు స్వేచ్ఛగా తెలపవచ్చని కార్యకర్తలకు నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -