Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి 

గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నర్సాయపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భావన నిక్కి ఆయన  ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు రూ. 20 లక్షలు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ పద్మ రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, ఎస్టి సెల్ అధ్యక్షులు కృష్ణ నాయక్, బలరాం నాయక్, డిసిసి కార్యదర్శి కషన్న యాదవ్, మాజీ సర్పంచ్లు సుధాకర్ గౌడ్, నర్సింగరావు, ఎల్లికంటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మషన్న, కార్యదర్శి సంపంగి రమేష్, కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంబ రాధాకృష్ణ, తుమ్మనపేట సర్పంచ్ పుట్ట సురేష్, కొండనాగుల సర్పంచ్ పద్మ,మహాదేవపూర్ సర్పంచ్ ఇమ్మడి సైదులు, యువజన ఉపాధ్యక్షులు తగురం మహేశ్, ప్రధాన కార్యదర్శి గోరటి శివ, యుగేందర్, ఎమ్మార్వో శ్రీకాంత్, ఎంపీడీవో రాఘవులు, ఏపీఎం సైదులు, పంచాయతీ కార్యదర్శి  ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -