Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్కారం అయ్యేలా కృషి

ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్కారం అయ్యేలా కృషి

- Advertisement -

సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్కారం అయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా కృషి చేస్తామని చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్ తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ గ్రామ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై జీపీ పరిధిలోని వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన పేదలకు అందేలా చూడాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత ఇంటి పరిసరాలు, క్లీన్ గా ఉంచుకోవాలని గ్రామస్తులకు కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పులిగంటి రామయ్య, వార్డు సభ్యులు పి.అవినాష్, పి.సరిత, జె.లక్ష్మయ్య, పి.సదయ్య, పి.అఖిల, పి.రాజేశ్వరి, అంగన్ వాడి టీచర్స్, ఆశాలు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -