నాల్గవ టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా సతీష్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం ఆయన నాల్గవ పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. గంజాయి రవాణా,సేవించిన, అమ్మిన, కొన్న వంటి నేరాలను అరికట్టడానికి కృషి చేస్తానని తెలిపారు. దొంగతనాల నివారణ కు కృషి చేస్తానని, నేరాలను అరికట్టడానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4 వ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



