Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సురక్షిత ప్రాంతంగా చేసేందుకు కృషి: ఏసీపీ

సురక్షిత ప్రాంతంగా చేసేందుకు కృషి: ఏసీపీ

- Advertisement -

– నవీపేట్ మండల కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు 
నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించి సురక్షిత ప్రాంతంగా చేసేందుకు కృషి చేస్తున్నామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ అన్నారు. మండల కేంద్రంలో శనివారం మేకల సంత కావడంతో రోడ్లపై ఉన్న వాహనాలను, దుకాణ సమదాయపు ప్రచార బోర్డులు, టేబుల్లు, తోపుడు బండ్లు, హోటలలోని గ్యాస్ సిలిండర్ లు, కోకాలను జిపి సిబ్బందితో కలిసి శనివారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిత్యం రద్దీగా ఉంటూ రైల్వే గేటు, బాసర సరస్వతికి వెళ్లే రహదారి, వారంలో రెండు సంతలు ఉండడం వలన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి సామాన్య ప్రజలతో పాటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతితో కలిసి వ్యాపార కూడళ్లలో ఇబ్బందులు కలిగించే వాటిని తొలగించి సూచనలు చేశామని తెలిపారు.

మరోసారి వచ్చినప్పుడు సిపి ఆదేశాల మేరకు తొలగిస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటో వాలాలు తమ వాహనాలకు తప్పనిసరిగా లైసెన్స్, ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూసుకోవాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు తప్పవని అన్నారు. కాబట్టి మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి రవీంద్ర నాయక్, సిబ్బంది, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -