నవతెలంగాణ – జుక్కల్ : అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో బుధవారం మొదటి రోజు అంగన్వాడి పాఠశాలల ప్రారంభోత్సవాలు మండలంలోని 52 కేంద్రాలలో అంగరంగ వైభవంగా అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సాగర్ గావ్ , ఖండేబల్లుర్ , మహ్మదాబాద్ తండా , కౌలాస్ , పడంపల్లి , లొంగన్ , పెద్దగుళ్లా, చెండేగాం, మాదాపూర్, హంగర్గ , పెద్ద ఏడిగి , మరియు తాండ, నాగల్ గావ్ , శక్తి నగర్, జుక్కల్, బిజ్జల్ వాడి , డోన్ గావ్, వజ్రఖండి , బస్వాపూర్, గ్రామాలలో అన్ని అంగన్వాడి సెంటర్లలో ర్యాలీలు నిర్వహించారు. బడిబాట కార్యక్రమం ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నూతన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి పలువురు విద్యార్థులకు అంగన్వాడి కేంద్రంలో చేర్పించుకోవడం జరిగింది. మొదటి రజు వచ్చిన పిల్లలకు రుచికరమైన గుడ్డుతో పాటు బిర్యానీ వంటకాలు చేసి పిల్లలకు వడ్డించడం జరిగింది. అనంతరం ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ బాట అంగన్వాడి బాట కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల కేంద్రాల టీచర్లు తదితరులు పాల్గొన్నారు .
అంగన్వాడీ బడిబాటలో ఎగ్ బిర్యానీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES