- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర సభ్యుడు ఇటీవల రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుచే నియామక పత్రాన్ని అందుకున్న దండు రమేష్ ను శనివారం మండల కేంద్రమైన తాడిచర్లలో ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు కుంట సదానందం, మెరుగు రాజయ్య, మేనం సతీష్, రాగం ఐలయ్య, నీలం ఐలయ్య, బిర్నేని దుర్గాప్రసాద్, యాద గట్టయ్య బొకెలు అందజేశారు. అనంతరం వారు ఆయనకు అభినందనలు తెలిపారు.
- Advertisement -