Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవారికి కూడా ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేయాలి

వారికి కూడా ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేయాలి

- Advertisement -

టీజీటీజేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా వేతనాలు పొందుతున్న , మోడల్‌ స్కూల్‌, గురుకుల, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య పథకాన్ని వర్తింపజేయాలని టీజీటీజేఏసీ కోరింది. ఈ మేరకు గురువారం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్‌ రెడ్డి తదితర నాయకులు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆదర్శ, గురుకుల, ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 ఆర్థిక పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. సరిహద్దు జిల్లాల వారికి అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో కూడా చికిత్స అందేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -